ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు డెబ్యూ మూవీ లాంచ్ అయింది

Sun,June 23, 2019 10:03 AM
Priya Prakash Varrier telugu debut movie launched

రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన కుంద‌నాల బొమ్మ ప్రియా ప్రకాశ్ వారియ‌ర్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేవ‌లం క‌న్నుగీటుతోనే దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందింది. ఆమె పేరు చెబితే కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు ప‌రిగెడుతుంటాయి. ఒరు ఆదార్ ల‌వ్ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన ప్రియా ప్ర‌కాశ్ శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్ చిత్రంతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు. అయితే టాలీవుడ్‌కి ఓ కుర్ర హీరో సినిమాతో ప్రియా డెబ్యూ ఇవ్వ‌నుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చింది. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇటీవ‌ల భీష్మ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయిన ఈ ల‌వ‌ర్ బోయ్ తాజాగా మ‌రో సినిమా మొద‌లు పెట్టాడు. నితిన్ 28వ సినిమాగా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని చంద్ర‌శేఖ‌ర్ యేలేటి తెర‌కెక్కించ‌నున్నారు. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారు. కొద్ది సేప‌టి క్రిత‌మే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మొత్తానికి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు డెబ్యూ నితిన్ సినిమాతో కానుండ‌డం విశేషం.


1607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles