నిజం చెబితే విమ‌ర్శిస్తున్న వారి ప‌రువు పోతుంది: ప్రియా ప్రకాశ్‌

Tue,March 12, 2019 11:51 AM
Priya Prakash Varrier strong comments on oru aadar love team

మ‌ల‌యాళ చిత్రం ఒరు ఆదార్ ల‌వ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు చిత్ర ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ లులు, స‌హా న‌టి నూరిన్ షెరీఫ్‌. ప్రియా ప్రకాశ్‌కి వ‌చ్చిన క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు స్క్రిప్ట్ మార్చమ‌ని బ‌ల‌వంతం చేశారని, అస‌లు సినిమాలో హీరోయిన్‌గా నూరిన్‌ని అనుకున్నామ‌ని ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ లులు ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇక చిత్రంలో లీడ్ రోల్‌ని స‌పోర్టింగ్ రోల్ చేసి, స‌పోర్టింగ్ రోల్‌ని లీడ్ రోల్ చేయ‌డం త‌న‌కు చాలా బాధ క‌లిగిందని నూరిన్ అంది. ఇక మీద‌ట ప్రియా ప్ర‌కాశ్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ వ‌చ్చిన అస్సలు ఒప్పుకోను. రోష‌న్‌తో మాత్రం న‌టిస్తా. ఒక‌ర‌కంగా ప్రియా వ‌ల‌న నా కెరీర్ చాలా లాస్ అయింది అంటూ నూరిన్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది నూరిన్ . ఈ వివాదం రోజు రోజుకి ముదురుతున్న క్ర‌మంలో ప్రియా ప్ర‌కాశ్‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా, అస‌లు ఏం జ‌రిగిందే చెబితే నన్ను విమ‌ర్శించే వారి ప‌రువు పోతుంది. న‌న్ను విమ‌ర్శించే వారికి కాల‌మే స‌మాధానం చెబుతుంద‌ని ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ పేర్కొంది. క‌న్నుగీటుతో కోట్లాది ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ‌ని పొందిన న‌టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ న‌టించిన‌ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న ఇటు తెలుగు, అటు మ‌ల‌యాళంలో విడుద‌లైంది. చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్‌తో పాటు నూరిన్ షెరీఫ్, రోషన్ అబ్దుల్ రహూఫీ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో లవర్స్ డే పేరుతో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

3077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles