మ‌రో క్రేజీ వీడియోతో ఆక‌ట్టుకున్న‌ ప్రియా ప్ర‌కాశ్‌

Wed,July 24, 2019 11:33 AM
Priya Prakash Varrier shares a kiss with a twist

క‌న్నుగీటుతో దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన న‌టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ . ఆమె పేరు చెబితే కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు ప‌రిగెత్త‌డం ఖాయం. ఒరు ఆదార్ ల‌వ్ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన ప్రియా ప్ర‌కాశ్ శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించేందుకు సిద్ధ‌మైంది. ఇక నితిన్ 28వ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ద‌మైంది ఈ అమ్మ‌డు. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రంలో ర‌కుల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, మ‌రో క‌థానాయిక‌గా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ అల‌రించ‌నుంది.

అయితే సినిమాల‌తోనే కాక ప‌లు ప్ర‌మోష‌న‌ల్ వీడియోస్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ .. సినిమాటోగ్ర‌ఫ‌ర్ సినూ సిద్ధార్థ్‌తో క‌లిసి క్రేజీ వీడియో చేసింది. ఇందులో వారిద్ద‌రూ ఓ పార్కులో కూర్చుని.. ముద్దు పెట్టుకునే మూడ్ క్రియేట్ చేసి చివ‌రికి సినూ సిద్ధార్థ్ వాట‌ర్ తాగేస్తాడు. ఈ ప్రాంక్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. నెటిజ‌న్స్ దీనిపై భిన్న‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

1816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles