బ‌న్నీ త‌నయుడి వీడియోపై స్పందించిన ప్రియా ప్ర‌కాశ్‌

Wed,January 23, 2019 08:40 AM
Priya Prakash Varrier reacts on bunny gun shot

కొంటెచూపుతో కుర్రకారుని గిలిగింతలు పెట్టిన సోగకళ్ళ చిన్నది ప్రియా ప్రకాశ్ వారియర్. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ప్రియా ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా అయ్యారు. మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్లో ప్రియా తన లవ్ ఎక్స్ ప్రెస్ చేసే విధానానికి ఫ్లాట్ అయిన బ‌న్నీ తన ట్విట్టర్ ఎకౌంట్లో వీడియోని షేర్ చేస్తూ.. ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియో చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది అంటూ అప్ప‌ట్లో కామెంట్ పెట్టాడు. అంతేకాదు తన తనయుడితో ఈ యాక్ట్ ట్రై చేశాడు.

ప్రియాలా మారిన అర్జున్ తన వేళ్ళకి ముద్దు పెట్టి , బల్లపై ఉన్న కుమారుడికి గురి పెట్టాడు. దీంతో వెంటనే అయాన్ టేబుల్ పై నుండి బెడ్ పైకి జంప్ చేశాడు. అప్ప‌ట్లో ఈ వీడియో ఫుల్ వైర‌ల్ అయింది. అయితే ఈ విష‌యంపై తాజాగా స్పందించింది ప్రియా ప్ర‌కాశ్‌ వారియ‌ర్‌. త‌న సినిమా ప్రమోష‌న్‌లో భాగంగా హైద‌రాబాద్‌కి వ‌చ్చిన ఈ అమ్మ‌డు .. అల్లు అర్జున్ చాలా పెద్ద స్టార్. ఆయ‌న మా వీడియోస్ చూసి అభినందించారు. ఆయ‌న కుమారుడు చేసిన గ‌న్ షాట్ సీన్ నేను చూసి చాలా ఎంజాయ్ చేసాను. ఆయన మా సినిమా ఆడియో లాంచ్‌కి రావ‌డం సంతోషంగా ఉంది. బ‌న్నీని క‌లుసుకునేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నాను అని ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలిపింది. ఓరు అదార్ లవ్ చిత్రం తెలుగులో ల‌వ‌ర్స్ డే పేరుతో ఫిబ్ర‌వరి 14న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

2707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles