విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రియా ప్ర‌కాశ్.. ఫోటో వైర‌ల్

Thu,August 8, 2019 12:41 PM

క‌న్నుగీటుతో కోట్లాది ప్ర‌జ‌ల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న‌ కుంద‌నాల బొమ్మ ప్రియా ప్రకాశ్ వారియ‌ర్.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక్క‌ క‌న్నుగీటుతోనే దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందింది. ఆమె పేరు చెబితే కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు ప‌రిగెడుతుంటాయి. ఒరు ఆదార్ ల‌వ్ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన ప్రియా ప్ర‌కాశ్ శ్రీదేవి బంగ్లా అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మైంది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది ఈ అమ్మ‌డు.


టాలీవుడ్ ల‌వ‌ర్ బోయ్ నితిన్ 28వ సినిమాగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు . ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారు. ఇటీవ‌ల‌ పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. నితిన్ సినిమాతోనే ఆమె తెలుగు డెబ్యూ ఇస్తుంది. అయితే కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లోఉంటున్న ప్రియా ప్ర‌కాశ్ యూత్ ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని క‌లిసింది. ఆయ‌న‌తో ఫోటో దిగి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అనే కామెంట్ ఫోటోకి పెట్టింది. ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ప్రియా త్వ‌ర‌లో విజ‌య్‌తో క‌లిసి సినిమా చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అంటూ నెటిజ‌న్స్ స్పందిస్తున్నారు.
View this post on Instagram

Nuvvante naaku chala ishtam😋

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

7095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles