ప్రిన్సెస్ సితార బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్- వీడియో

Sun,July 21, 2019 07:07 AM
Princess Sitara birthday celebrations

మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌ల ముద్దుల త‌న‌య సితార జూలై 20,2019తో ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. సితార బ‌ర్త్‌డే వేడుక‌లు హైద‌రాబాద్‌లో కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య ఘ‌నంగా జ‌రిపారు మ‌హేష్ దంప‌తులు. దేవి శ్రీ ప్ర‌సాద్, వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు కూడా బ‌ర్త్‌డే సెలబ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు. సితార‌కి ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ లో A&S అనే పేరుతో చానల్ స్టార్ట్ చేసిన సితార ఇందులో మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. వారానికి ఓ వీడియో షేర్ చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తాన‌ని సితార తెలిపింది. రానున్న రోజుల‌లో ఈ చిన్నారి వెండితెర‌పై సంద‌డి చేయం ఖాయ‌మ‌ని అంటున్నారు





5743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles