222 రోజలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న చైతూ చిత్రం

Sun,January 10, 2016 12:33 PM
premam creates another record

ప్రస్తుత రోజుల్లో ఒక చిత్రం వంద రోజులు నడవాలంటే పెద్ద గగనం అయిపోయింది. కాని నాగ చైతన్య చిత్రం 222 రోజుల పాటు నడచిందంటే అందరికి ఆశ్యర్యం కలుగక మానదు. మరి అదే చిత్రం అనే కదా మీ డౌట్ .. మరేం లేదండి నాగ చైతన్య ప్రస్తుతం ఓ మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసి తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోండగా, ఆ మలయాళ చిత్రం తమిళ రాష్ట్రంలో ఇప్పటికి 222 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుందట.

ఆల్ఫోన్స్ పుథీరన్ దర్శకత్వం వహించిన ప్రేమమ్ సినిమా 2015లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని చందు మొండేటి మజ్ఞు అనే టైటిల్‌తో చైతూ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇక మలయాళ వర్షెన్ ప్రేమమ్‌లో నివిన్ పాళీ నటించగా ఈ చిత్రం తమిళ నాడులో ఎలాంటి బ్రేక్ లేకుండా 222 రోజుల పాటు నిర్విరామంగా థీయేటర్లలో నడుస్తూనే ఉందట.

ఒక మలయాళ చిత్రం తమిళనాడులో ఇన్ని రోజలు కంటిన్యుయస్‌గా నడుస్తుందంటే ఈ చిత్రం అభిమానులను ఏ రేంజ్‌లో ఆకర్షిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ ప్రేమమ్ రీమేక్‌తో చైతూ తెలుగు ప్రేక్షకులకు ఏ రేంజ్ వినోదాన్ని అందిస్తారో చూడాలి.

3123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles