ప్రేమ క‌థా చిత్రం సీక్వెల్ హీరో, హీరోయిన్స్ ఎవ‌రంటే ?

Thu,August 2, 2018 10:13 AM
prema katha chitram sequel secod schedule starts soon

సుధీర్ బాబు, నందిత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో హ‌ర‌ర్ అండ్ ల‌వ్ కాన్సెప్ట్ ఆధారంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ చిత్రం ప్రేమ‌క‌థా చిత్ర‌మ్. 2003 మే 11న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదాన్ని అందించింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతుది. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా ‘ప్రేమ కథా చిత్రం 2’ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం మెద‌టి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుని... ఆగష్టు మొద‌టి వారంలో భారీగా రెండ‌వ షెడ్యూల్‌ని జ‌రుపుకోవ‌డానికి సిద్ధ‌మైంది . ఈ చిత్రానికి 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథగా ప్రేమ క‌థా చిత్రం2 రూపొందుతుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. చిత్రంలో మ‌రో హీరోయిన్ గా సిధ్ధి ఇదాని చేస్తుంది. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమాకి ప‌ని చేస్తున్నారు. సెప్టెంబర్ వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తుండగా, ఏడాది చివ‌రకి మూవీని విడుద‌ల చేయ‌నున్నారు.

1638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles