సూప‌ర్ హిట్ మూవీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Fri,November 2, 2018 11:59 AM
prem kumar counters allegations made by bharathiraja

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , చెన్నై చంద్రం త్రిష జంటగా నటించిన త‌మిళ చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల అయింది. ఇందులో విజ‌య్ సేతుప‌తి ఫోటోగ్రాఫ‌ర్‌గా క‌నిపించ‌గా, త్రిష స్కూల్ టీచ‌ర్ పాత్ర పోషించింది. పదో తరగతిలోనే ప్రేమలోపడ్డ రామ్‌(విజయ్‌), జాను (త్రిష)ల ప్రేమకథ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఎంద‌రో సెల‌బ్రిటీల నుండి అభినంద‌న‌లు అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ఇప్ప‌టికే ఈ చిత్ర రైట్స్ తీసుకున్నారు. అతి త్వ‌ర‌లోనే మూవీకి సంబంధించి న‌టీన‌టులు వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. ద‌ర్శ‌కుడు భార‌తీ రాజా ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్న సురేష్ ఈ క‌థ రాసుకోగా మ‌రుధ పాండియ‌న్ అనే వ్య‌క్తి ద్వారా 96 చిత్ర ద‌ర్శ‌కుడు ప్రేమ్ కుమార్‌కి వెళ్ళిందట‌. మ‌రుధ పాండియ‌న్.. సురేష్‌కి స్నేహితుడు కాగా, ఆయ‌న మోసం చేసాడ‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు భార‌తీరాజా. అయితే ఇందులో ఎంత మాత్రం నిజంలేదు. సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకే రాద్దాంతం చేస్తున్నారు. స‌మ‌స్యని చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కోవ‌డానికి సిద్దంగా ఉన్నాను అంటూ ప్రేమ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. మ‌రి ఈ వివాదం ఎలా స‌ద్ధుమ‌ణుగుతుందో చూడాలి.

4436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles