నాకూ మీటూ అనుభవం ఉంటే బాగుండేది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Mon,November 19, 2018 01:09 PM
Preity Zintas shocking comments on Metoo Movement draws backlash

మీటూ.. కొన్ని నెలలుగా సినిమా రంగంతోపాటు వివిధ రంగాలను కుదిపేస్తున్న ఉద్యమమిది. తమపై గతంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి పలువురు మహిళలు బయటకు వచ్చి చెప్పడంతో ఈ ఉద్యమం మొదలైంది. ఇది ఏకంగా ఓ కేంద్ర మంత్రిని తన పదవి కోల్పోయేలా చేసింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు సమాజం తన వంతు సానుభూతి చూపించింది. అయితే బాలీవుడ్ వెటరన్ నటి ప్రీతి జింటా తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అయి ఉంటే బాగుండేది. దీని గురించి ఇంకా బాగా వివరించేదాన్ని. అయినా మనల్ని అవతలివాళ్లు ఎలా చూడాలని మనం అనుకుంటామో అలాగే చూస్తారు అంటూ ప్రీతి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇవాళ్టి స్వీటూ.. రేపటి మీటూ కావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ.. ఇంత సీరియస్ అంశంపై చాలా సరదాగా నవ్వుతూ చెప్పింది. లైంగిక వేధింపుల బాధితుల్ని చులకన చేసేలా ప్రీతి వ్యాఖ్యలు ఉండటంపై చాలా మంది మండిపడుతున్నారు. ఈ మధ్య బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రీతి జింటా చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తున్నది. ట్విటర్‌లో చాలా మంది ఆమె కామెంట్స్‌ను తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
4276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles