వాల్మీకి ప్రీ టీజ‌ర్ టైం ఫిక్స్ చేసిన ద‌ర్శ‌కుడు

Sat,June 22, 2019 10:49 AM
pre teaser time fix for valmiki

వ‌రుణ్ తేజ్, హ‌రీష్ శంకర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్నక్రేజీ ప్రాజెక్ట్ వాల్మీకి. త‌మిళ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌ల‌ ప్ర‌ముఖ శివ క్షేత్రం యాగంటిలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 14రీల్స్ బ్యానర్ పై ఆచంట రాము, గోపినాథ్ లు నిర్మిస్తున్న చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే చిత్ర క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పోస్ట‌ర్స్ విడుద‌ల కాక‌పోయే స‌రికి మూవీపై ఆస‌క్తి అభిమానుల‌లో రోజురోజుకి పెరుగుతూ పోతుంది. ఈ క్ర‌మంలో వాల్మీకి ప్రీ రిలీజ్ టీజ‌ర్ ని జూన్ 24 సాయంత్రం 5:18ని.ల‌కి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు టీం పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. వాల్మీకి చిత్రంతో తమిళ నటుడు అథర్వ మురళి తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.

1228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles