మెగా హీరో చిత్ర ప్రీ లుక్ విడుద‌ల‌

Tue,September 10, 2019 12:24 PM
Prati Roju Pandaage Pre Look first look tomorrow at 8pm

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్ర‌ల‌హ‌రి చిత్రం త‌ర్వాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు పండ‌గే అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. చిత్రలహరి విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కల‌ప‌డం విశేషం. స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. తాజాగా చిత్ర ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఇద్ద‌రు వ్య‌క్తులు చేతిలో చేయి క‌లిపిన‌ట్టుగా ఉంది. వేలు విడ‌వ‌ని బంధం అనే క్యాప్ష‌న్‌తో పోస్ట‌ర్ ఉండ‌గా, రేపు రాత్రి 8గం.ల‌కి చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

1526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles