క్వీన్ తెలుగు రీమేక్ కోసం యంగ్ డైరెక్ట‌ర్ ..!

Wed,May 30, 2018 08:27 AM
Prashanth Varma directs queen telugu remake

బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ క్వీన్ సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తెలుగులో క్వీన్ వన్స్ అగైన్, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్ అనే టైటిల్స్ తో రూపొందుంది. బాలీవుడ్ చిత్రం 'క్వీన్' ను నిర్మాత త్యాగరాజన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నీలకంఠ డైరెక్ట్ చేయ‌గా, తమిళ, కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ దర్శకత్వం వహించాడు.

క్వీన్ రీమేక్ మొదటి షెడ్యూల్ ఫ్రాన్స్ లో జరిగింది. సెకండ్ షెడ్యూల్‌కి ఏర్పాట్లు జ‌రుగుతున్న త‌రుణంలో తెలుగు రీమేక్‌లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న త‌మ‌న్నాకి, డైరెక్ట‌ర్ నీల‌కంఠ‌కి మ‌ధ్య కొన్ని గొడ‌వ‌లు జ‌రిగాయ‌ట‌. దాంతో ఆయ‌న ఈ సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు . దీంతో చిత్ర నిర్మాత‌లు కొత్త ద‌ర్శ‌కుడి కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌గా, క‌న్న‌డ యాక్ట‌ర్, డైరెక్ట‌ర్ ర‌మేష్ అర‌వింద్ ఫ్రేమ్‌లోకి వ‌చ్చారు. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం తెలుగు వ‌ర్షెన్‌ని అ సినిమాతో మంచి హిట్ కొట్టిన ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు టాక్.య త్వ‌ర‌లోనే తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించి షూట్ ప్రారంభించ‌నున్నారని తెలుస్తుంది. ఈ మూవీలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మేల్ లీడ్ చేస్తున్నాడు.

1249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles