షాక్ తో ప్రభాస్ అభిమాని మృతి!

Sun,October 23, 2016 12:44 PM
prashanth died by cureent shock

సినీ హీరోలపై అభిమానులు ప్రదర్శించే అత్యుత్సాహం ఒక్కోసారి వారి జీవితాల్లో విషాదం నింపుతుంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. తమ అభిమాన హీరోని తక్కువగా మాట్లాడారని అవతలి వారితో పోట్లాడడం లేదంటే సదరు హీరో బర్త్ డే వేడుకలకు లేదా సినిమా రిలీజ్ అప్పుడు ఫ్లెక్సీలు కొడుతూ ఒక్కోసారి బిల్డింగ్ ల పై నుండి పడడం జరుగుతుంది. అదీ కాకపోతే కరెంట్ షాక్ తో కూడా మృతి చెందడం వంటివి చాలానే జరిగాయి. మరి ఇలాంటి సంఘటనల వలన సదరు అభిమానుల ఫ్యామిలీ దుఃఖం సాగరంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రభాస్ బర్త్ డే వేడుకలలోను ఓ విషాదం నెలకొన్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ అతని జన్మదిన వేడుకులను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రశాంత్ (19) అనే అభిమాని తన హీరో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ వైర్లు తగిలి షాక్ తో మృతి చెందాడట. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. మరి ఈ సంఘటనకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

2614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles