ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ని ద‌త్త‌త తీసుకున్న ప్ర‌ణీత

Tue,October 16, 2018 01:27 PM
Pranitha Subhash Adopts Government School in Alur

బెంగ‌ళూరు బ్యూటీ ప్ర‌ణీత హ‌స్స‌న్ జిల్లాలోని అలుర్ ప్రాంతంలో ఉన్న‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ని ద‌త్త‌త తీసుకొని అంద‌రి హృద‌యాలు గెలుచుకుంది. సినిమాల‌తో పెద్ద‌గా అల‌రించని ఈ అమ్మ‌డు సామాజిక సేవ‌ల‌తో మాత్రం అభిమానుల మ‌న‌స్సుల‌ను దోచుకుంటూనే ఉంటుంది. 2017లో మొట్ట మొద‌టి సారి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో వాలంటీర్‌గా ప‌నిచేసింది ప్ర‌ణీత‌. ఆ సమ‌యంలో బ‌డి వాతావ‌ర‌ణం, పిల్ల‌లు చ‌దివే విధానాన్ని గ‌మ‌నించింది. ఏడో త‌ర‌గ‌తి విద్యార్థికి కూడా క‌నీసం ఇంగ్లీష్ బాష‌పై అవ‌గాహ‌న లేద‌ని తెలుసుకొని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ని ద‌త్త‌త తీసుకుంది. పాఠ‌శాల అభివృధ్ధి కోసం 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని విరాళంగా అందించిన ప్ర‌ణీత విద్యార్థినుల‌కి మ‌రుగుదొడ్ల‌ని ఏర్పాటు చేయ‌డం మా తొలి ధ్యేయం అంటుంది. ఆ త‌ర్వాత పిల్ల‌ల‌కి అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు కూడా నేర్పించాల‌నుకుంటున్నాం. ఇందుకోసం మా స్నేహితులంతా ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాం అని ప్ర‌ణీత స్ప‌ష్టం చేసింది. త‌న తండ్రి పుట్టిన ఊరు ఆలేరు కాగా, ముందుగా ఈ ఊరులోని స్కూల్‌ని అభివృద్ధి ప‌ర‌చి ఆ త‌ర్వాత మిగ‌తా పాఠ‌శాల‌ల‌ని కూడా ద‌త్త‌త తీసుకోవాల‌నుకుంటున్నాను అని ప్ర‌ణీత చెప్పుకొచ్చింది. సెకండ్ హీరోయిన్‌గా ఎక్కువ చిత్రాల‌లో క‌నిపించిన ప్ర‌ణీత హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. అక్టోబ‌ర్ 18న ఈ మూవీతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించనుంది ముద్దుగుమ్మ‌.

2178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS