‘ఎన్టీఆర్’ గా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్..?

Wed,October 11, 2017 11:53 AM
prakashraj in lakshmis NTR movie ?


హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసినప్పటికీ..లీడ్ రోల్స్‌లో ఎవరెవరు నటిస్తున్నారనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రకాశ్‌రాజ్ సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఫేస్‌బుక్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు వర్మ. ఎన్టీఆర్ పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటించడం లేదని..అది పూర్తిగా అవాస్తవమని చెప్పాడు వర్మ. ఈ సినిమాలో నటీనటులను ఇంకా ఫైనల్ చేయలేదు. ఒకవేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ కోసం నటీనటులను సెలెక్ట్ చేస్తే వెల్లడిస్తామని తెలిపాడు వర్మ.

1134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles