క‌శ్మీర్‌లో ఫ్యామిలీతో స‌ర‌దాగా...

Sun,June 2, 2019 09:01 AM
Prakash Raj enjoyed in kashmir

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ కొన్నాళ్ళుగా ఎన్నిక‌ల‌తో బిజీ అయ్యారు. బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన ప్రకాష్‌రాజ్ దారుణంగా ఓడిపోయారు. ఆయ‌న‌కి 25,881 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి రిజ్వాన్‌ హర్షద్‌కు 4,96,720 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మోహన్‌కు 5,41,792 ఓట్లు పోలయ్యాయి. అయితే త్వ‌ర‌లో సొంత పార్టీ పెడ‌తాడంటూ ప‌లు వార్తలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. క‌ట్ చేస్తే ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌స్తుతం సినిమా షూటింగ్‌లో భాగంగా క‌శ్మీర్‌కి వెళ్ళారు . ఆయ‌న సతీమణి పోనీ వర్మ, కుమారుడు వేదాంత్‌తో కలిసి విలువైన సమయం గడుపుతున్నారు. తన ట్విట్ట‌ర్‌లో ఫ్యామిలీతో క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేసిన ప్ర‌కాశ్ రాజ్ ‘కశ్మీర్‌లో ఉన్నాం. నా అందమైన దేశం. నా అద్భుతమైన కుటుంబంతో సమయం గడుపుతున్నా. వేసవి తర్వాత షూటింగ్‌, విహారయాత్ర’ అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.4635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles