సైరా చిత్రంలో వరుణ్‌ తేజ్ భామ..!

Mon,September 4, 2017 03:38 PM
Pragya Jaiswal selected for Chiranjeevi starrer Sye Raa Narasimha Reddy

వరుణ్‌ తేజ్ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కించిన కంచె చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ ప్రగ్యా జైస్వాల్. సినిమా సినిమాకి తనలో టాలెంట్ ని పెంచుకుంటూ వెళుతూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ అమ్మడు. నాగార్జున నటించిన ఓం వెంకటేశాయ చిత్రంలోను ప్రత్యేక పాత్రలో మెరిసి అలరించింది ప్రగ్యా. ఇక తాజాగా వచ్చిన నక్షత్రం చిత్రంలో తన గ్లామర్ తో యూత్‌ కి పిచ్చెక్కించింది కంచె భామ. అయితే ఈ అమ్మడికి మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా మూవీలో నటించే అవకాశం దక్కిందని ఇండస్ట్రీ వర్గాలు ఉంటున్నాయి. చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కావలసి ఉండగా, మొయిన్ హీరోయిన్ గా నయనతారని ఎంపిక చేశారు. ఇక మిగతా ఇద్దరిలో ప్రగ్యా ఒకరిగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్,సుదీప్, విజయ్ సేతపతి వంటి టాప్ స్టార్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అవుతున్నారనే సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌ తో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రగ్యా అవకాశం దక్కిందనే వార్త నిజమైతే ఈ అమ్మడి కెరీర్ కి కొన్నాళ్ళ వరకు డోకా ఉండదనే చెప్పవచ్చు.

3737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS