ప్ర‌గ్యా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Fri,January 12, 2018 12:45 PM
Pragya Jaiswal first look revealed

వరుణ్‌ తేజ్ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కించిన కంచె చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ ప్రగ్యా జైస్వాల్. సినిమా సినిమాకి తనలో టాలెంట్ ని పెంచుకుంటూ వెళుతూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ అమ్మడు. నాగార్జున నటించిన ఓం వెంకటేశాయ చిత్రంలోను ప్రత్యేక పాత్రలో మెరిసి అలరించింది ప్రగ్యా. ఇక తాజాగా వచ్చిన నక్షత్రం చిత్రంలో తన గ్లామర్ తో యూత్‌ కి పిచ్చెక్కించింది కంచె భామ. అయితే ఈ భామ ప్ర‌స్తుతం ఆచారి అమెరికా యాత్ర చిత్రంలో న‌టిస్తుంది. జి. నాగేశ్వ‌ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్నాడు. బ్రహ్మనందం ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులోని స‌న్నివేశాలు మూవీపై ఆస‌క్తిని క‌లిగించాయి. ఇక ఈ రోజు ప్ర‌గ్యా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మంచు విష్ణు ఈ అమ్మ‌డికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ప్ర‌గ్యా జైస్వాల్ ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశాడు. ఇందులో ప్ర‌గ్యా చాలా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంది. పద్మజ పిక్చర్స్ బేనర్ పై కీర్తి చౌదరి నిర్మిస్తున్న ఆచారి అమెరికా యాత్ర చిత్రాన్ని జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.1252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS