ప్రాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం

Sun,September 16, 2018 10:32 AM
Prague schedule  competes for f2

టాలీవుడ్ తెర‌కెక్కుతున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో ఎఫ్‌2 (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) ఒక‌టి. అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఎంతో ప్రస్టేజీయ‌స్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ జోడి క‌ట్టింది. చిత్రంలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌లు తోడ‌ళ్ళుగా క‌నిపించనున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వ‌ర‌లోనే చిత్ర టీజ‌ర్ ఒక‌టి విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా చిత్రంప్రాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో పాటు రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. డిసెంబ‌ర్‌లో మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

1374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS