ప్ర‌భు లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా

Fri,December 28, 2018 12:32 PM
Prabhu Look Got Leaked

ప్ర‌స్తుతం అందరి దృష్టి మోహన్‌ లాల్‌ నటిస్తున్న మరక్కర్‌: అరబి కదలింతే సింహాం అనే మ‌ల‌యాళ చిత్రం పైనే ఉంది. పీరియడ్‌ డ్రామాగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా లో మోహన్‌లాల్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తుండగా, నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కీర్తిసురేష్‌ కథానాయికగా ఎంపికైంది. ఇందులో నాగార్జున సముద్రదొంగగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోని పేరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.100కోట్ల బడ్జెట్‌తో మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

16వ‌ శతాబ్దంలో జామోరిన్‌ నేవీ(కేరళా) పరిధిలో నేవీ అధికారిగా పనిచేసిన కుంజలీ మరక్కర్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేరళా సముద్ర తీర ప్రాంతంపై పోర్చుగ్రీస్‌ వారు దాడికి యత్నించగా దాన్ని కుంజలీ ఎంతో చాకచక్యంగా ఎదుర్కొని తన ధైర్య సాహసాలు, తెలివితేటలను చాటుకున్నారు. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం ఇటీవ‌ల ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ప్ర‌భు చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన ఫోటో ఒక‌టి లీక్ అయింది. భారీ గ‌డ్డంతో పొడ‌వాటి జుట్టుతో క‌నిపిస్తున్న ప్ర‌భు ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మోహ‌న్ లాల్ త‌న‌యుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్‌తో పాటు క‌ళ్యాణి ప్రియ‌దర్శి ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. సినిమాలో చైనీస్‌ కమాండర్‌ ప్రేయసిగా కీర్తీ సురేశ్‌ కనిపించనున్నారు. అర్జున్‌, సునీల్‌ శెట్టి తదితరులు నటించనున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.

1641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles