8కె టెక్నాలజీతో ట్రైలింగ్యువ‌ల్ మూవీ

Tue,May 30, 2017 05:27 PM
Prabhu Deva, Tamannaah movie in 8k technology

న‌టుడిగా, ద‌ర్శకుడిగా, కొరియోగ్రాఫ‌ర్ గా స‌త్తా చాటుతున్న ప్ర‌భుదేవా ఆ మ‌ధ్య డెవిల్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌లైంది. ఇందులో ప్ర‌భుదేవా స‌ర‌స‌న త‌మన్నా క‌థానాయిక‌గా న‌టించింది. ఇక తాజాగా ఈ జంట మ‌రో ప్రాజెక్ట్ కోసం క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. కామోషీ అనే టైటిల్ తో ఓ ట్రైలింగ్యువ‌ల్ మూవీ తెర‌కెక్క‌నుండగా ఈ చిత్రాన్ని 8కె టెక్నాల‌జీతో రూపొందించ‌నున్నారు. ఇందులో ప్ర‌భుదేవా, త‌మ‌న్నాలు హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌క్రి తోలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా, ఈ మూవీ న‌య‌న‌తార న‌టించిన కొలైయుతిర్ కాల‌మ్ చిత్రానికి రీమేక్ అని అంటున్నారు. ఇందులో త‌మ‌న్నా చెవిటి, మూగ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ చిత్ర షూటింగ్ మొత్తం లండ‌న్ లో జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. చిత్రానికి సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారని టాక్.

1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles