మరోసారి డెవిల్ కాంబినేషన్

Fri,November 3, 2017 10:12 AM
Prabhu Deva Begins His Next Film With AL Vijay on nov 1

ప్రభుదేవా, ఏల్ విజయ్ కాంబినేషన్ లో డెవిల్ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. గత ఏడాది డెవిల్ అనే టైటిల్ తో తమిళంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో అభినేత్రి టైటిల్ తో, హిందీలో టుటక్ టుటక్ టుటియా పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. త్రిభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికి ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. థ్రిల్లర్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రం నవంబర్ 1 న సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా నిన్న టీంతో కలిసారు. ఐశ్వర్య రాజేష్, కరుణా కరన్ ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారని తెలుస్తుండగా, సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ కన్ ఫాం చేయలేదు.

964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles