ప్ర‌భుదేవా, హ‌న్సిక‌ల 'గులేబాకావ‌లి'

Fri,August 11, 2017 01:26 PM
Prabhu Deva And Hansika  Gulebakavali

గ‌తంలో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఎంగేయుమ్ కాదల్ మూవీలో న‌టించిన హ‌న్సిక ఇప్పుడు ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. గులాబాకావ‌లి అనే టైటిల్ తో తెర‌కెక్కుతున్న మూవీలో ప్ర‌భుదేవా, హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా వెట‌ర‌న్ యాక్ట‌ర్ రేవ‌తి కీరోల్ పోషిస్తుంది. కేజేఆర్ స్టూడియోస్ బేన‌ర్ పై క‌ళ్యాణ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ని హ‌న్సిక తాజాగా త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ఇది ఓ సాంగ్ కి సంబంధించిన స్టిల్ అని తెలుస్తుండ‌గా, ఇందులో ప్ర‌భుదేవా, హ‌న్సిక‌లు మెరుస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. వివేక్ మెర్విన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హ‌న్సిక ఇటీవ‌ల గౌత‌మ్ నందా చిత్రంతో ఆడియ‌న్స్ ముందుకు రాగా, ఈ చిత్రం నిరాశ‌ప‌ర‌చింది. మ‌ల‌యాళ మూవీ విల‌న్ లోను కీల‌క పాత్ర పోషిస్తుంది హ‌న్సిక‌. ఈ చిత్రంలో శ్రేయ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది హ‌న్సిక.


2814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles