రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌లో గెస్ట్ రోల్ చేయ‌నున్న ప్రభాస్ ?

Sun,April 14, 2019 08:38 AM

ఇటీవ‌లి కాలంలో సినిమాల‌కి సంబంధించి వ‌స్తున్న‌ పుకార్లు విన‌డానికి బాగానే ఉన్నా, అది ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే దానిపై క్లారిటీ లేక అభిమానులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తాజాగా రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌లో బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ న‌టించ‌బోతున్నాడ‌నే వార్త దావానంలా పాకింది. అల్లూరి సీతారామ‌రాజు, కొమరం భీమ్ పాత్రలు ప్ర‌భాస్ వాయిస్‌తోనే ప్రారంభం అవుతాయ‌ని ఓ ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, మ‌రో వైపు ప్ర‌భాస్ చిత్రంలో కీల‌క పాత్ర చేయ‌నున్నాడ‌ని కూడా అంటున్నారు. ఒకే తెర‌పై ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి హ‌ద్దులు అనేవి ఉంటాయా? మరో వైపు ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ స్థానంలో నిత్యా మీన‌న్ న‌టించ‌బోతుందంటూ ప్రచారం జ‌రుగుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. ఇటీవ‌ల చ‌ర‌ణ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న చిత్రీక‌ర‌ణకి కాస్త బ్రేక్ ప‌డింది. త్వ‌ర‌లోనే మొద‌లు కానున్న ఈ చిత్రాన్ని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. బాలీవుడ్ న‌టులు అజ‌య్ దేవ‌గ‌ణ్, అలియా భ‌ట్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

2468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles