న్యూలుక్‌తో ప్రభాస్ సర్‌ప్రైజ్ ..

Mon,July 17, 2017 10:23 PM
న్యూలుక్‌తో ప్రభాస్ సర్‌ప్రైజ్ ..


హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత సాహో గెటప్‌లో కనిపించి సందడి చేసిన ప్రభాస్ తాజాగా సరికొత్త లుక్‌తో అదరగొడుతున్నాడు. రీసెంట్ ప్రభాస్ న్యూలుక్ స్టిల్ ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నది. ప్రభాస్ తన హెయిర్‌స్టెల్‌ను మార్చేసి లవర్‌బాయ్‌లా కనిపించే ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మేగజైన్ కోసం ప్రభాస్ న్యూస్టిల్ తీశారని తెలుస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ న్యూలుక్ ఏదైనా సినిమాకు సంబంధించింది అయి ఉంటుందని తెగ సంబరపడిపోతున్నారు.

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సాహో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ప్రభాస్‌కు జోడీ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

2114

More News

VIRAL NEWS