విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ప్ర‌భాస్ స‌పోర్ట్

Fri,November 16, 2018 01:56 PM
prabhas supports to vijay

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన విజయ్ దేవరకొండ రేపు ట్యాక్సీవాలా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే . జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాక్సీ డ్రైవర్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది. చిత్రంలో షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ ,మాళవిక నాయర్ లు హీరోయిన్‌లుగా న‌టించారు . విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో శివ అనే పాత్రలో టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై అభిమానుల‌లో చాలా అంచ‌నాలు ఉన్నాయి. అయితే రిలీజ్‌కి ముందే ఈ చిత్రం పైర‌సీ బారిన ప‌డ‌డంతో నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు చిత్ర యూనిట్‌కి మ‌ద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ .. టాక్సీవాలా చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ అంద‌జేస్తూ.. ఈ చిత్రాన్నిథియేట‌ర్స్‌లోనే చూడండి. పైర‌సీని ఎంక‌రేజ్ చేయోద్ద‌ని అన్నారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ ల‌వ్ స్టోరీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

3209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles