త‌న బ‌ర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ ఉంటుంద‌న్న ప్ర‌భాస్

Thu,October 18, 2018 10:39 AM
prabhas special surprise on this month 23

బాహుబ‌లి సినిమాతో అంత‌ర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్. ఆయ‌న ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చిత్రం ఒక్క‌టి కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో ఈ రెండు సినిమాల‌కి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే అక్టోబ‌ర్ 23 కాగా, ఆ రోజు ప్ర‌త్యేక విష‌యం షేర్ చేసుకోబోతున్నాను అని ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపారు. అంతేకాదు అంద‌రికి ద‌స‌రా శుభాకాంక్ష‌లు కూడా తెలిపారు.

ప్ర‌భాస్ పోస్ట్ త‌ర్వాత అంద‌రి దృష్టి ఆయ‌న ఏం చెప్ప‌బోతున్నార‌నే విష‌యంపై ఉంది. బ‌ర్త్ డేరోజు ప్ర‌భాస్ చెప్ప‌బోవు ఆ ప్ర‌త్యేక విష‌యం ఏంటా అని అభిమానులు జోరుగా చ‌ర్చ‌లు జ‌రుపుకుంటున్నారు. ప్ర‌భాస్ పెళ్లి విష‌యంపై ఆ రోజుతోనైన క్లారిటీ వ‌స్తుందా ? సాహో మూవీ మేకింగ్ విడుద‌ల కానుందా ? రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న‌ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నారా ? ఇలా ప‌లు ర‌కాల అనుమానాలు అభిమానుల మ‌న‌సుల‌లో మెదులుతున్నాయి. వీటిపై పూర్తి క్లారిటీ రావాలంటే మ‌రో నాలుగు రోజుల ఆగ‌క తప్ప‌దేమో మ‌రి! ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ..రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తుండ‌గా ఈ మూవీ ఇట‌లీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ కూడా అక్క‌డే ఉన్నాడు. ఈ ద‌స‌రాని టీంతో స‌రాదాగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు.

1819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles