రేస్ లుక్ లో ప్రభాస్..'సాహో' కొత్త పోస్టర్

Mon,May 27, 2019 03:55 PM
Prabhas race look in saaho new poster


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా చిత్రయూనిట్ ప్రభాస్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. సాహో నుంచి మరో పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రభాస్ స్టైలిస్ లుక్ లో చెవికి బ్లూటూత్ డివైస్ పెట్టుకుని..బైకును రేస్ చేస్తున్నాడు. కొత్త స్టిల్ చూస్తుంటే సాహోలో ఓ యాక్షన్ సీన్ కు సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ సినిమా రోజురోజుకీ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తుంది.

యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.300 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తోంది. బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్ , మురళీ శర్మ, జాకీష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

1817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles