ప్ర‌భాస్-పూజా హెగ్డే చిత్రానికి టైటిల్ ఫిక్స్..!

Thu,January 10, 2019 08:54 AM
Prabhas Next With Pooja Hegde Titled As Jaan confirmed

బాహుబ‌లి కోసం నాలుగున్న‌రేళ్ళు ప‌ని చేసిన ప్ర‌భాస్ 2017లో బాహుబలి ది కంక్లూజ‌న్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం ప్ర‌భాస్ రేంజ్ దేశ వ్యాప్తంగా పాకేలా చేసింది. గ‌త ఏడాది ప్ర‌భాస్ న‌టించిన ఏ ఒక్క చిత్రం కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో అభిమానులు నిరాశ‌లో ఉన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు అదిరిపోయే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు డార్లింగ్. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. శ్ర‌ద్ధా క‌పూర్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రో వైపు త‌న 20వ చిత్రంగా కె కె రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో రూపొందుతున్న‌ట్టు స‌మాచారం. చిత్రానికి జాన్ అనే టైటిల్‌ని క‌న్‌ఫాం చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క్లైమాక్స్ కి సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుండ‌గా, అతి త్వ‌ర‌లోనే చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నార‌ని అంటున్నారు.

2973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles