త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ప్ర‌భాస్ టీవీ ఛానెల్ ?

Tue,May 14, 2019 01:04 PM
prabhas may be part in tv business

ప్ర‌స్తుతం స్టార్ హీరోస్, హీరోయిన్స్ సినిమాల‌తో బిజీగా ఉంటూనే వ్యాపార రంగంలోను రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో నాగార్జున ,చిరు ప్ర‌ముఖ ఛానెల్‌లో భాగ‌స్వామిగా ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కూడా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో భాగ‌స్వామి అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు త్వ‌ర‌లో ఓ టీవీ ఛానెల్ ప్రారంభించ‌నుండ‌గా,అందులో ప్ర‌భాస్ కూడా భాగ‌స్వామి కానున్నార‌ని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఏదేమైన మ‌న స్టార్స్ ఓ వైపు న‌ట‌న‌ని కొన‌సాగిస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్ట‌డం విశేషం. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ బాబు ఏఎమ్‌బీ అనే మ‌ల్టీ ప్లెక్స్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విష‌యం విదిత‌మే. బ‌న్నీ కూడా త్వర‌లోనే ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌నున్నాడ‌ని అన్నారు. కాగా , ప్రస్తుతం ప్రబాస్‌ 'సాహో' చిత్రంతో పాటు రాధాకృష్ణ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు , సాహో చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

4881
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles