‘అరకురోడ్‌లో’ ప్రత్యక్షమైన ప్రభాస్

Thu,August 25, 2016 09:57 AM
Prabhas Launches Araku Road Lo Song Teaser

సాయి రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై వాసుదేవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘అరకురోడ్‌లో’ . మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా ఈ చిత్ర సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘ఎప్పుడురా పెళ్లి..’ అనే ఈ సాంగ్‌ నా గురించే రాసినట్లుంది. లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్‌ చాలా వెరైటీగా ఉంది. సహజంగా పూరీ గారు తన సినిమాలలో ట్యూన్స్‌, లిరిక్స్‌ ఆయనే రాస్తుంటారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌లా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్‌ అదిరిపోయింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు. సెప్టెంబర్‌ 10న సినీ ప్రముఖుల సమక్షంలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో ఆవిష్కరణ జరుపనుండగా .. పూరీ సంగీత్‌ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు. మరి తాజాగా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

2447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles