పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చిన ప్ర‌భాస్‌

Thu,May 24, 2018 09:43 AM
prabhas gives clarity on rumors

బాహుబలి సినిమాతో అంత‌ర్జాతీయ గుర్తింపు పొందిన న‌టుడు ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శక‌త్వంలో సాహో చేస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ రిస్కీ స్టంట్స్ చేస్తున్నాడు. ఇటీవ‌ల అబుదాబి షెడ్యూల్ ముగియ‌డంతో అక్క‌డి మీడియాకి ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ , త‌న‌కి మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చాడు. క‌ర‌ణ్‌కి, నాకు మ‌ధ్య విభేదాలు ఉన్నాయి అని ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని క‌ర‌ణే నాకు ఫోన్ చేసి చెప్పారు. కాని మా ఇద్ద‌రి మ‌ధ్య అలాంటిదేమి లేదు. మేమిద్ద‌రం మంచి స్నేహితులం. బాహుబ‌లి సినిమాని క‌ర‌ణ్ హిందీలో ప్ర‌మోట్ చేశాడు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `కుచ్ కుచ్ హోతా హై` సినిమా అంటే నాకు చాలా ఇష్టం అని ప్ర‌భాస్ చెప్పాడు. అంటే క‌ర‌ణ్ జోహార్‌, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో ఓ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంద‌నే వార్త అప్ప‌ట్లో రాగా, ఈ ప్రాజెక్ట్ త‌ప్ప‌క ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల‌లోను విడుద‌ల కానుంది. ప్ర‌భాస్‌కి దేశ‌వ్యాప్తంగా మార్కెట్ ఉండ‌డంతో సాహో సినిమాని వీలైనన్ని భాష‌ల‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

5327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles