ప్ర‌భాస్‌పై సిద్ధార్ధ్ కామెంట్‌.. ఫైర్ అయిన ఫ్యాన్స్‌

Tue,July 17, 2018 11:29 AM
Prabhas Fans Trolls Siddharth On Twitter

హీరో సిద్ధార్ద్ ఇటు తెలుగు అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌కి బాగా సుప‌రిచితం. చివ‌రిగా గృహం అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సిద్ధార్ద్ అభిమానుల‌నిఎంత‌గానో అల‌రించాడు. అయితే ప్ర‌స్తుతం ఈ హీరో చేసిన ట్వీట్ వ‌ల‌న ప్ర‌భాస్ అభిమానులు అత‌నిపై ఆగ్ర‌హంతో ఉన్నారు. వివ‌రాల‌లోకి వెళితే ప్ర‌భాస్ అభిమానులు రీసెంట్‌గా #100DaysToKingPRABHASBday అనే హ్యాష్ ట్యాగ్‌ని సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. త‌మిళ క్రిటిక్ ర‌మేష్ బాలా .. ప్ర‌భాస్ పుట్టిన రోజుకి వంద రోజులు ఉంద‌ని, ఇప్పుడు హ్యాష్ ట్యాగ్‌తో కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింద‌ని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సిద్ధార్థ్‌ నెక్ట్స్ పుట్టిన రోజుకు 465 రోజులు ఉందంటూ #465DayToKingPRABHASNextBday అనే హ్యాష్ ట్యాగ్‌ని త‌న ట్వీట్‌కి జ‌త చేసి కామెంట్‌ చేశాడు. అంతేకాదు థ్రిల్ కిల్ చేస్తుంద‌ని అని అన్నాడు.

సిద్దార్ద్ ట్వీట్స్ కాస్త వెట‌కారంగా అనిపించ‌డంతో అత‌నిని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌. నువ్వు ఇలాంటి ట్వీట్ ర‌జ‌నీకాంత్‌, అజిత్‌, విజ‌య్ ఫ్యాన్స్‌కి వేసి ఉంటే త‌రువాతి నిమిషంలో ట్విట్ట‌ర్ నుండి బ‌య‌ట‌కి వెళ్లేవాడివ‌ని ఓ అభిమాని అన్నాడు. దీనిపై సిద్ధార్ద్ స్పందిస్తూ.. రోజు రోజుకి హ్యాష్ ట్యాగ్ అనేది జోక్‌గా మారింది. నా జోక్‌కి ప్ర‌జ‌లు కూడా న‌వ్వుతారు. ట్విట్ట‌ర్ నుండి బ‌య‌ట‌కు వెళ్ళాల‌ని ఎవరు కోరుకోరు అంటూ సిద్ధూ ట్వీట్ చేశాడు. మ‌రో నెటిజ‌న్ ప్ర‌భాస్ .. నీ ఫ్రెండ్‌నే క‌దా ఎందుకు అలా కామెంట్ చేశావు అని సిద్దూకి ట్వీట్ చేయ‌గా, ‘అందుకే భయ్యా. ఫ్రెండు కాబట్టే ఫ్రీడం తీసుకున్నా. డార్లింగ్‌ కూడా నవ్వుతాడు జోక్‌ విని. ప్రతిదానికి టెన్షన్‌ పడితే లైట్‌ తీసుకోడానికి టైమ్‌ ఉండదు కద భయ్యా?’ అంటూ రిప్లై ఇచ్చాడు.. మొత్తానికి ఇటు ప్ర‌భాస్ అభిమానుల ట్వీట్స్‌, సిద్ధూ రిప్లైల‌తో సోష‌ల్ మీడియా కాసేపు హాట్ హాట్‌గా మారింది.
3577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS