జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌భాస్ కామెంట్

Sun,August 18, 2019 07:19 AM
prabhas comments on jagan governance

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం సాహో ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌ని ఓ యాంక‌ర్ జ‌గ‌న్ గురించి అడిగారు. త‌మిళ‌నాడులో జ‌గ‌న్‌ని పొలిటికల్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారని.. ఆయన గురించి మీరు ఏం అనుకుంటున్నారంటూ ప్ర‌శ్నించారు. అందుకు ప్ర‌భాస్‌.. నాకు రాజ‌కీయాల‌లో పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. కాక‌పోతే యంగ్ సీఎంగా జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తార‌నే న‌మ్మకం నాతో పాటు ప్ర‌జ‌ల‌లో ఉంది. జ‌గ‌న్ ప‌నితనం బాగుంది అని స్ప‌ష్టం చేశారు ప్ర‌భాస్. 151 సీట్ల‌తో అఖండ విజయాన్ని నమోదు చేసిన జగన్‌పై ప్ర‌భాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్ర‌భాస్ మాట్లాడిన మాట‌ల‌కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ప్రభాస్ తాజా చిత్రం సాహో ఆగ‌స్ట్ 30న భారీ ఎత్తున విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.



3494
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles