గోపిచంద్ త‌న‌యుడి బ‌ర్త్‌డే పార్టీలో బ‌న్నీ, ప్ర‌భాస్

Sat,September 14, 2019 08:36 AM
Prabhas at Gopichand second son Viyaan 1st birthday celebrations

మాచో హీరో గోపిచంద్ 2013 మే నెలలో రేష్మ‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.. వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి అబ్బాయి పుట్టాడు. అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు. ఇక గ‌త ఏడాది వినాయ‌క చ‌వితి రోజున మ‌రో అబ్బాయి పుట్టాడు. అత‌నికి వియాన్ అనే పేరు పెట్టారు. నిన్న వియాన్ మొద‌టి బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్ ఘ‌నంగా జ‌ర‌ప‌గా ఈ వేడుక‌కి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు. వారిద్ద‌రితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. గోపిచంద్ స‌తీమ‌ణి రేష్మ .. శ్రీకాంత్ బంధువు అన్న సంగ‌తి తెలిసిందే. బీటెక్ చ‌దివిన రేష్మా త్రీడీ యానిమేష‌న్, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ల‌పై ప‌ట్టు సాధించింది. ప్ర‌స్తుతం గోపిచంద్ చాణక్య అనే చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రం మ‌రికొద్ది రోజుల‌లో విడుద‌ల కానుంది. ఇక బిను సుబ్రమణ్యం అనే కొత్త ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్‌లోను ఓ సినిమా చేస్తున్నాడు గోపిచంద్.

4756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles