గ్రాండ్‌గా లాంచ్ అయిన ప్ర‌భాస్ 20వ చిత్రం

Thu,September 6, 2018 11:19 AM
prabhas 20 movie with jil director

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కేవ‌లం ఒక్క బాహుబ‌లి చిత్రం కోసం నాలుగ‌న్న‌ర ఏళ్ళు పని చేశాడు . అత‌ని ప‌డ్డ క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం అందించింది బాహుబ‌లి చిత్రం. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. శ్ర‌ద్ధా క‌పూర్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. క‌ట్ చేస్తే ప్ర‌భాస్ 20వ చిత్రం జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ విష‌యంపై ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. త‌న త‌ర్వాతి ట్రైలింగ్యువ‌ల్ చిత్రం కె కె రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంద‌ని చెప్పిన ప్ర‌భాస్‌, ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుందని కూడా తెలియ‌జేశాడు. అయితే కొద్ది సేప‌టి క్రితం ఈ మూవీ గ్రాండ్‌గా లాంచ్ అయింది . అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ముఖ్య అతిధిగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా, ప‌లువురు ప్ర‌ముఖులు కూడా పూజా కార్య‌క్రమంలో పాలు పంచుకున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

3196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles