సీఎం కేసీఆర్ గెలవాలని దేవుడ్ని కోరుకున్నా: పోసాని

Wed,December 12, 2018 03:09 PM
Posani Krishna Murali Praises Telangana CM KCR

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 88 స్థానాలు గెలుచుకుని విజయఢంకా మోగించిన సందర్భంగా గులాబీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సైతం గెలవాలని ఎప్పుడూ కోరుకోలేదని.. కేసీఆర్ గెలుపు కోసం దేవుళ్లకు మొక్కుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పోసాని స్పందించారు. కేసీఆర్ గెలిచినందుకు ఉదయం గుడికి కూడా వెళ్లొచ్చాను. తెలంగాణ ప్రజలు మరోసారి మానవత్వాన్ని చూపారు. తెలంగాణ ప్రజలది గొప్ప మనస్తత్వం. ఆంధ్ర కమ్మ వాళ్ళు రానున్న ఎన్నికల్లో ఇదే విధంగా వ్యవహరించాలి. లేకుంటే.. భవిష్యత్తులో సమాజం కమ్మలను వెలివేసే పరిస్థితి వస్తుంది. ప్రతిపక్షనేత జగన్‌పై దాడిని చంద్రబాబు అపహాస్యం చేశారని విమర్శించారు.

రాజగోపాల్ సైంధవ పార్ట్-2..

డబ్బుల సంచులతో ఆంధ్ర నుంచి సైంధవుడిలా చంద్రబాబు వచ్చాడు. ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన వాడికి.. బక్కవాడు ఎంత అనుకున్నాను. లగడపాటి రాజగోపాల్ సైంధవ పార్ట్-2గా మారాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సగం తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు కేసీఆర్ మంచి ఆలోచనల నుంచి వచ్చాయి. కేసీఆర్ ఫౌంహౌస్‌లో ఉంటాడని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు.. తహసీల్దార్ వనజాక్షిపై దాడి కన్పించలేదా? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కమ్మ దురద ఎక్కించారు. తెలంగాణలో ఉన్న కమ్మ వాళ్ళు నందమూరి సుహాసినీకి ఓటు వేయలేదు. అందుకే తెలంగాణలో ఉన్న ఆ కులం వాళ్ళు టీఆర్‌ఎస్‌కే ఓటేశారు. తెలంగాణలో నివసిస్తున్న కమ్మవాళ్ళు విజతతో వ్యవహరించారు. సుహాసినీని ఎన్నికల్లో పోటీకి నిలిపి ఆమెను చంద్రబాబు బలిపశువును చేశాడని మండిపడ్డారు.

బాలకృష్ణ ఎంతమంది తాటతీశాడో సమాజానికి తెలుసు..

ఏపీలో జగన్‌కు ఉన్న ఫాలోయింగ్ చంద్రబాబుకు అస్సలు లేదు. బాలకృష్ణ ఎంతమంది తాటతీశాడో సమాజానికి తెలుసు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేసినా.. చంపిన వారిని బాలకృష్ణ ఏం చేశాడో తెలియదా? ఆంధ్ర రాజకీయాల్లో కేసీఆర్ కచ్చితంగా వెళ్ళాల్సిందే.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. పోలింగ్‌కు ముందే సర్వే వివరాలు ఎందుకు చెప్పాడో.. లగడపాటి చెప్పాలి. లోకేష్ ప్రచారం చేయలేదు కాబట్టి.. తెలంగాణలో టీడీపీకి రెండు సీట్లు అయినా వచ్చాయి అని పోసాని ఎద్దేవా చేశారు.

గద్దర్ లాంటి వ్యక్తి కూడా చంద్రబాబుతో భాగస్వామి కావడం చూసి ఆశ్చర్యపోయాను. సంక్షేమ పథకాలు కేసీఆర్‌ను గెలిపించాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. చంద్రబాబు డబ్బు సంచులతో దిగారు. సెటిలర్లను సైతం కేసీఆర్ తెలంగాణ బిడ్డలుగా చూసుకున్నారని ప్రశంసించారు.

2836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles