చంద్ర‌బాబు నుండి స‌ర్‌ప్రైజ్ అందుకున్న పాపుల‌ర్ సింగ‌ర్

Sun,July 21, 2019 07:20 AM
Pop Singer Smita surprised with cbn letter

పాప్‌ సాంగ్స్‌తో ఎక్కువ పాపుల‌ర్ పొందిన సింగ‌ర్ స్మిత‌. మొక్కజొన్న తోట‌లో..., మ‌స‌క మ‌స‌క చీక‌టిలో లాంటి సాంగ్స్‌తో ఫుల్ పాపులర్ అయింది స్మిత‌. గాయ‌నిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆమెని అభినందిస్తూ లేఖ పంపారు. ఈ లేఖ‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన స్మిత‌.. ఇది నిజంగా నాకు చాలా స‌ర్‌ప్రైజింగ్ ఉంది. ధ‌న్య‌వాదాలు చంద్ర‌బాబు గారు అని సంతోషం వ్య‌క్తం చేసింది.

‘నటి, గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు అద్భుతంగా ఆహ్లాదం కల్గిస్తున్నందుకు అభినందనలు. తెలుగులో ప్రసిద్ధి చెందిన గాయ‌ని, న‌ర్త‌కిగా గుర్తింపు పొందిన స్మిత వ‌ల్లూరిప‌ల్లి తెలుగులో మొట్ట మొద‌టి పాప్ ఆల్బ‌మ్ రూపొందించ‌డం గ‌ర్వ‌కార‌ణం. శ్రోత‌లను అలరించడానికి వివిధ రూపాల్లో పాటలను వేదికగా చేసుకుని స్మిత సాగిస్తున్న ప్రయాణం అనిర్వచనీయం. కాలానికి అనుగుణంగా పాటల పందిరి నిర్మాణం మరింత జనరంజకం అవుతుందని విశ్వసిస్తున్నాను. ఆదిలో పాప్ సంగీతంతో ప్ర‌స్థానం ప్రారంభించి భ‌క్తి సంగీతంలోను త‌న‌దైన శైలిలో వీనుల‌విందైన గానంతో ఆధ్యాత్మిక భావ‌న పాదుకొల్ప‌డంలో స్మిత పాత్ర మ‌రువ‌లేనిది. ఒక్క తెలుగులోనే కాకుండా సంగీతానికి ఎల్లలు లేవని తెలుపుతూ 9 భాషల్లో పాటలు పాడిన ఘనత సాధించడం ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ స్మిత తన మధుర కంఠంతో ఇలానే న‌వ‌యువ పండిత పామ‌రుల‌ని అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.1116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles