యూట్యూబ్‌లో అభ్యంతరకర వీడియోలు..నటి పూనం కౌర్ ఫిర్యాదు

Wed,April 17, 2019 06:32 AM
Poonam Kaur lodges complaint of social media harassment

హైద‌రాబాద్‌: తనపై యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీనటి పూనం కౌర్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. రెండేండ్లుగా యూట్యూబ్‌లో తనను మానసికంగా ఇబ్బందులు పెడుతూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన పోస్టింగ్‌లకు సంబంధించిన 50 యూట్యూబ్ లింకులను ఆమె సైబర్‌క్రైమ్ పోలీసులకు అందజేసింది.

ఇలా ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. ఈ పోస్టింగ్‌లతో రాజకీయం చేస్తున్న వారు కూడా ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకొని, ఆ పోస్టింగ్‌లను తొలిగించాలని పోలీసులను కోరారు. ఈ పోస్టింగ్‌లతో ఎవరైనా రాజకీయం చేశారా? అని విలేకరులు ప్రశ్నిస్తే ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. తమకు ఫిర్యాదు అందిందని, పరిశీలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ తెలిపారు.

2645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles