ఆట పాట‌ల‌తో సంద‌డిగా మారిన బిగ్ బాస్ హౌజ్‌

Fri,August 3, 2018 08:58 AM
pooja selected new captain for bigg bos house

బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన నూత‌న్ నాయుడు, శ్యామ‌ల రాక‌తో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌లో నూత‌న ఉత్తేజం వచ్చింది. వారి రాక‌తో అంద‌రు షాక‌వ్వ‌డంతో పాటు హ్యాపీగా ఫీల‌య్యారు . కంటెస్టెంట్స్‌కి సర్‌ప్రైజ్ గిప్ట్ రూపంలో వారిని ఇంట్లోకి బిగ్‌బాస్ పంపించాడు. ఇక బిగ్‌బాస్ హౌజ్ ఈ వారం కొత్త కెప్టెన్ కోసం వినూత్న టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్‌. కెప్టోన్ పోటీ దారులైన పూజా, రోల్ రైడా, సామ్రాట్‌లు డీజేలుగా ఉంటారు. గార్డెన్ ఏరియాలో డీజే సెట్స్‌తో పాటు డ్యాన్స్ చేయ‌డానికి స్టేజెస్ ఏర్పాటు చేసి ఉండ‌గా, కెప్టెన్ పోటీ దారులు ముగ్గురు వారికి కేటాయించిన సెట్స్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి సాంగ్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ స‌మ‌యంలో పోటీ దారుల‌కి మ‌ద్దతు తెలిపే వారు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. నాలుగు సార్లు డీజే ద‌గ్గ‌ర‌ పాటలు ప్లే అవుతాయి. ఒక్కో డీజే ద‌గ్గ‌ర ఒక్కరు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. మద్దతిచ్చే వారి ముందు ఒక్కొక్కరు.. ఒక్కసారి మాత్రమే డ్యాన్స్ చేయాలని సూచించారు బిగ్ బాస్.


సామ్రాట్‌కి మద్దతుగా బాబు గోగినేని, దీప్తి సునైన, నందిని, తనీశ్ లు స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. రోల్‌ రైడాకి మద్దతుగా శ్యామల, అమిత్, గణేశ్ డ్యాన్స్ చేశారు. ఇక పూజా‌కి మద్దతుగా.. గీతా మాధురి, దీప్తి, నూతన నాయుడు, కౌశల్ డ్యాన్స్ చేశారు. దీంతో.. సామ్రాట్, పూజాకి నలుగురేసి చొప్పున మద్దుతు రావడంతో పోటీ సమమైంది. ఈ దశలో కంటెస్టెంట్స్‌ అందరూ చర్చించుకుని.. ఒకరికి మద్దతు తెలుపుతూ డ్యాన్స్ చేయాలని సూచించగా.. పూజా రామచంద్రన్‌ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. దీంతో ఆమె ఈ వారం కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది. ఇంటి స‌భ్యులు అంద‌రు పూజాని అభినందించారు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో విశ్వ‌రూపం 2 ప్ర‌మోష‌న్ కోసం బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్ చేసే సంద‌డి ప్ర‌సారం కానుంది. త‌మిళ బిగ్ బాస్ హౌజ్‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌మ‌ల్ హాస‌న్ తెలుగు ఇంటి స‌భ్యుల‌తో ఏఏ విష‌యాలు షేర్ చేసుకుంటారో చూడాలి.

2429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS