సినిమా స్టోరీని తలపిస్తున్న పూజా ప్రేమాయణం

Fri,August 31, 2018 03:06 PM
Pooja Ramachandran gives clarity on her love

బిగ్ బాస్ సీజన్ 2లో మెరుపు తీగలా వచ్చిన వెళ్ళిన భామ పూజా రామచంద్రన్. తెల్లవారుజాము సమయంలో బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అందరికి గట్టి పోటీ ఇచ్చిన ఈ భామ కౌశల్ ఆర్మీ వలన అతి తక్కువ టైంలోనే బయటకు వచ్చేసింది. నిఖిల్ ‘స్వామిరారా’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన పూజా పలు చిత్రాలలో ముఖ్య పాత్రలు కూడా పోషించింది. అయితే బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ అమ్మడు మూడు పెళ్లిళ్లు చేసుకుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన పూజా అందరిలానే తాను పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. పనిలో పనిగా తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. మొదట తాను ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది పూజా. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తితో విడిపోయిన తాను తమిళ ఎస్ ఎస్ మ్యూజిక్ ఛానెల్ లో పని చేసే క్రెయిగ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం వరకు దారి తీసింది. పెళ్లి అయిన కొన్నాళ్ళకు కలిసి ఉండలేమని నిర్ణయించుకున్న వారు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు స్నేహితులుగా ఉంటున్నామని పేర్కొంది. అయితే ప్రస్తుతం తెలుగులోను పలు చిత్రాలలో నటించిన జాన్ అనే వ్యక్తితో పూజా సహజీవనం చేస్తున్నట్టు తమిళ మీడియా కోడై కూస్తుంది. పూజా ప్రేమ, పెళ్లిల సంగతి సినిమా స్టోరీని తలపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు.

4447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles