రాజ‌మౌళి కోడ‌లి పాట వింటే ఫిదా కావ‌ల్సిందే..!

Mon,December 31, 2018 01:25 PM
Pooja Prasad  Sivudu Thandavamu video goes viral

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రాజ‌మౌళి త‌న‌యుడి వివాహ వేడుక హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించిన స్టార్స్ అంద‌రు పెళ్ళికి ముందే జైపూర్‌కి వెళ్ళగా, అక్క‌డ జ‌రిగిన మెహందీ, సంగీత్ వేడుక‌ల‌లో సెల‌బ్రిటీలు ఆడిపాడారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆదివారం సాయంత్రం రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జగపతిబాబు సోదరుడు రాం ప్రసాద్ కుమార్ కుమార్తె, గాయని పూజా ప్రసాద్‌తో రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో గల హోటల్ ఫెయిర్‌మౌంట్‌లో ఘ‌నంగా జరిగింది. ఈ వేడుకకు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, నాగార్జున‌, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా, అఖిల్ తదితరుల హాజరయ్యారు

కార్తికేయ వివాహ‌మాడిన పూజా ప్ర‌సాద్ భ‌క్తి గీతాల‌ని ఆల‌పించే గాయ‌నిగా ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వ‌య‌స్సు నుండే సంగీతంలో ప్రావీణ్యం పొందిన ఆమె సంగీత ప్రియులంద‌రికి సుప‌రిచిత‌మే. పలు సంగీత విభావరిలలో అనేక భక్తి గీతాలు ఆలపించిన పూజాకి ఇప్ప‌టికి మంచి డిమాండ్ ఉంది. రాజ‌మౌళి కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న నేప‌థ్యంలో పూజాకి సంబంధించిన పాత వీడియోలు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. క్రింద చూస్తున్న ఈ వీడియో 2010 సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ది కాగా, ఈ వీడియోని పూజా తండ్రి రాం ప్ర‌సాద్ త‌న యూట్యూబ్ ఎకౌంట్‌లో షేర్ చేశాడు. ఇందులో పూజా ప్ర‌సాద్ త‌న గానామృతంతో భక్తి పారవశ్యంలో ముంచెత్తిస్తుంది. వీడియోలో జ‌గ‌ప‌తి బాబు, ముర‌ళీ మోహ‌న్‌తో పాటు త‌దిత‌ర ప్ర‌ముఖులు ఉన్నారు.

5145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles