తొలి రోజు షూటింగ్‌లో..

Sat,September 21, 2019 08:29 AM

అందాల భూమ పూజా హెగ్డే ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. పూజా హెగ్డే న‌టించిన తాజా చిత్రం గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో పూజా న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక అల‌.. వైకుంఠ‌పుర‌ములో, హౌజ్‌ఫుల్ 4, ప్ర‌భాస్‌-రాధాకృష్ణ చిత్రంతో పాటు అఖిల్ నాలుగ‌వ చిత్రంలోను పూజా న‌టిస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు అఖిల్ నాలుగ‌వ మూవీ చిత్ర బృందంతో కలిసింది. సెట్స్‌లోకి ఎంట్రీతో పాటు సీన్ వివ‌రించే స‌న్నివేశాల‌ని వీడియో ద్వారా చూపించారు మేక‌ర్స్. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ నాలుగ‌వ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా , ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.




2086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles