ఫైన‌ల్ గా కుర్ర హీరోకి ఓకే చెప్పిన డీజే భామ‌..!

Wed,June 28, 2017 05:47 PM
pooja hegde paired with bellamkonda

ఒక లైలా కోసం,ముకుంద చిత్రాల‌తో టాలీవుడ్ ఆడియ‌న్స్ ని అల‌రించిన పూజా హెగ్డే బాలీవుడ్ హీరో హృతిక్ స‌ర‌స‌న కూడా న‌టించింది. ఇక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జ‌త‌క‌ట్టి డీజేతో మంచి హిట్ కొట్టింది. ఈ మూవీలో పూజా న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. దీంతో అమ్మడికి ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ త్వ‌ర‌లో శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఈ చిత్రం ఇటీవ‌లే లాంచ్ కాగా, త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నుంది. ఇందులో క‌థానాయిక కోసం పూజా హెగ్డేని సంప్ర‌దించ‌గా ఈ అమ్మ‌డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. ఈ మూవీ కోసం నిర్మాత‌లు భారీ మొత్తాన్నే ముట్ట‌జెప్ప‌నున్న‌ట్టు స‌మాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌స్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తో జ‌య జాన‌కి నాయ‌క‌ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. రకుల్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

2612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles