పూజా హెగ్డే డెడికేషన్ కు 'హౌస్ ఫుల్' టీం ఫిదా

Sun,November 18, 2018 04:26 PM
Pooja hegde dedication impressed House full 4 team

ఇటీవలే అరవింద సమేత చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది పూజాహెగ్డే. ఈ భామ ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో 'హౌస్ ఫుల్ 4' చిత్రంలో అక్షయ్ కు జోడీగా నటిస్తోంది. సినిమాలో పూజా తన పాత్ర షూటింగ్ పూర్తయ్యే వరకు చూపించిన శ్రద్ధ, నిబద్దతకు చిత్రయూనిట్ అంతా హాట్సాఫ్ చెప్పింది.

ఈ చిత్రం షూటింగ్ ముంబైలోని స్టూడియోలో జరిగింది. షూటింగ్ సమయంలో పూజా హెగ్డేకు జలుబు, దగ్గు సమస్యలు బాధించాయి. అయితే పూజా హెగ్డే తన సమస్యను ఏ మాత్రం లెక్కచేయకుండా మందులు వాడుతూ షెడ్యూల్ ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసింది. జలుబు, దగ్గు ఉన్నా సినిమా ఆలస్యమవకూడదని భావించి..షూటింగ్ లో పాల్గొన్న పూజా హెగ్డేకు హౌస్ ఫుల్ టీం ఫిదా అయిపోయింది. మహేశ్ బాబు నటిస్తోన్న మహర్షి చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్ 20వ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది.

3139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles