అర‌వింద స‌మేత షెడ్యూల్ పూర్తి చేసిన పూజా హెగ్డే

Fri,June 8, 2018 11:15 AM
Pooja Hegde completes latest schedule

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అర‌వింద స‌మేత‌. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. హైద‌రాబాద్ శివార్ల‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్‌కి పూజా హెగ్డే బైబై చెప్పింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ పీఎస్ వినోద్‌తో క‌లిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.సెట్స్‌కి రావ‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది, త‌ర్వాతి షెడ్యూల్ కోసం ఆగ‌లేక‌పోతున్నానంటూ పూజా పేర్కొంది. తార‌క్‌ని ఇప్పుడు మిస్ అయిన మ‌ళ్లీ క‌లుస్తానంటూ ఎమోజీల‌తో త‌న భావాల‌ని ప్ర‌క‌టించింది పూజా.

చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బ‌ని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రాఘ‌వ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని, అర‌వింద పాత్ర‌లో పూజా హెగ్డే సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా ఇందులో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించి అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.


1992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS