హోటల్ బిల్లు కట్టకుండా పరారయిన దండుపాళ్యం న‌టి

Wed,March 20, 2019 09:07 AM
Pooja Gandhi not paid the hotel bill

దండుపాళ్యం ఫేం పూజా గాంధీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో ఉండే పూజా తాజాగా ఓ ల‌గ్జ‌రీ హోట‌ల్‌కి బిల్లుక‌ట్ట‌కుండా ప‌రార‌య్యింద‌ట‌. దీంతో హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌ని ఆశ్ర‌యించింది. వివ‌రాల‌లోకి వెళితే పూజా గాంధీ కొద్ది రోజుల క్రితం బెంగ‌ళూరులోని ల‌గ్జ‌రీ హోట‌ల్‌లో గ‌దిని అద్దెకి తీసుకున్నారు. హోట‌ల్ బిల్లు సుమారు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న పూజా.. బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గ్ర‌హించిన హోట‌ల్ యాజ‌మాన్యం పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు న‌మోదు చేసి స‌మ‌న్లు జారీ చేశారు పోలీసులు. దీంతో పోలీసులు ఎదుట హాజ‌రైన పూజా తాను హోట‌ల్‌కి రూ. 2లక్ష‌లు చెల్లించిన‌ట్టు వెల్ల‌డించింది. మిగ‌తా మొత్తం చెల్లించ‌డానికి కాస్త స‌మ‌యం కావాల‌ని కోరింది. దీనికి హోట‌ల్ యాజ‌మాన్యం ఓకే చెప్ప‌డంతో వివాదం స‌మ‌సింది. కాని హోట‌ల్ బిల్లు చెల్లించ‌కుండా ఇలా ప‌రారవ్వ‌డం ఎంత వ‌ర‌కు కరెక్ట్ అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. 2002లో హిందీ చిత్రం ‘దుష్మణి’ ద్వారా పూజా గాంధీ వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 30 కన్నడ చిత్రాల్లో నటించారు. కన్నడలో చేసిన ‘దండుపాళ్యం’ ఫ్రాంచైజీతో పూజా గాంధీకి మంచి గుర్తింపు వ‌చ్చింది.

2911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles