హౌజ్‌లోకి న్యూ ఎంట్రీ.. ఫోన్ టాస్క్‌తో అంద‌రిలో ఆనందం

Wed,July 25, 2018 09:00 AM

బిగ్ బాస్ సీజ‌న్‌2లో ఇప్ప‌టికే ఆరుగురు స‌భ్యులు ఎలిమినేట్ కాగా ప్ర‌స్తుతం 11 మంది బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నారు. కొన్నాళ్ళ నుండి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంద‌ని చెబుతున్నా, అది ఎవ‌రనే విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇటు అభిమానులు అటు ఇంటి స‌భ్యుల‌లో కాస్త సందిగ్ధం నెల‌కొంది. 45వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లవ్‌ ఫెయిల్యూర్‌, స్వామి రారా, ఇంత‌లో నువ్వింత‌లో సినిమాలతో ఫేమస్‌ అయిన పూజా రామచంద్రన్ తెల్ల‌వారు జామున హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సోఫాలో ప‌డుకున్న ఆమెని ముందుగా కౌశ‌ల్ క‌నిపెట్ట‌గా, ఆ త‌ర్వాత డైనింగ్ టేబుల్ కింద దాచాడు. ట్రింగ్‌.. ట్రింగ్‌.. త‌డాంగు ట్రింగ్ ట్రింగ్ అనే పాట‌తో లేచిన ఇంటి స‌భ్యుల ముందు పూజా ప్ర‌త్య‌క్షం అయి షాకిచ్చింది. త‌న‌కు తానుగా ప‌రిచ‌యం చేసుకున్న పూజా ఆ త‌ర్వాత అనేక విష‌యాలు వారితో చ‌ర్చించింది.


ఇక ఆ త‌ర్వాత హౌజ్ ప్రేమ ప‌క్షులు త‌నీష్‌, దీప్తి సున‌య‌న‌ల మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రిగింది. సున‌య‌న హాయిగా నిద్రించ‌డానికి బిగ్ బాస్ ఇచ్చిన పిల్ల‌ల మంచంలో ప‌డుకున్న సున‌య‌న‌ని త‌నీష్ లేపేందుకు ప్ర‌య‌త్నించ‌గా, ఆమె లేక‌పోవ‌డంతో మంచాన్ని గట్టిగా కొట్టాడు. దీంతో కాస్త ఫీలైన సున‌య‌న.. తనీష్ నాతో చాలా రూడ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సామ్రాట్‌కి చెప్పింది. కెప్టెన్‌గా ఉండ‌డం వ‌ల‌న తనీష్ అలా అన్నాడేమో అని సామ్రాట్‌.. దీప్తికి న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా, అలా ఎలా మారిపోతారంటూ అల‌క‌పాన్పుపై కూర్చుంది. కొద్ది సేప‌టి త‌ర్వాత రాజీ ప‌డ్డ వారిద్ద‌రు హ‌గ్ చేసుకొని మళ్ళీ ఒక్క‌ట‌య్యారు. కొత్త‌గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజాకి త‌న గురించి చెప్పుకొచ్చాడు కౌశ‌ల్‌. మొద‌టి నుండి నేను ఒక్క‌డిని సింగిల్‌గా పోటీ చేస్తూనే ఉన్నాను. నన్ను ఎలిమినేట్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన అది వారి వ‌ల్ల కావ‌డం లేద‌ని కౌశ‌ల్ అన్నాడు. ఇక తేజూ ఎలిమినేట్ కావ‌డం గురించి కూడా కొద్ది సేపు చర్చించారు.

బిగ్ బాస్‌లో ఉన్న ఇంటి స‌భ్యులు త‌మ ఫ్యామిలీకి దూరం అవుతున్నామ‌ని చెబుతూ ఎన్నో సార్లు క‌న్నీరు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే వారికి మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ఇచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. కాక‌పోతే ఇందులో మెలిక కూడా పెట్టాడు. టాస్క్ ప్ర‌కారం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఫోన్ కాల్ వ‌స్తుంది. కాని వారి కోసం కాదు. ఇంట్లోని మిగ‌తా స‌భ్యుల‌లోని ఒక‌రి కోసం. ఫోన్ పిక‌ప్ చేసిన ఇంటి సభ్యునికి కాల‌ర్ ఇంట్లో త‌మ ప్రియ‌మైన వారి గురించి క్లూ ఇవ్వ‌డం జ‌రుగుతుంది.ఆ క్లూని బ‌ట్టి వారెవ‌రో క‌నిపెడితే ఇంటి స‌భ్యునికి ఫోన్ ఇవ్వ‌డం జ‌ర‌గుతుంది. లేదంటే ఫోన్ డిస్ క‌నెక్ట్ అవుతుంది. ఎవ‌రి కోసం అయితే ఫోన్ వ‌స్తుందో ఆ స‌భ్యుడే త‌ర్వాతి ఫోన్ కాల్ పిక‌ప్ చేస్తారు. ప్లాజ్మాలో ఛాన్స్ టూ టాక్ మీట‌ర్ ఉంటుంది. ప్ర‌తి ఫోన్ కాల్ త‌ర్వాత దాంట్లో ఛాన్స్ త‌గ్గిపోతూ ఉంటుంది. ఎరుపు రంగులోకి మారిన‌ప్పుడు దానిని పెంచుకోవ‌డానికి బిగ్ బాస్ కొన్ని టాస్క్‌లు ఇస్తారు. ఆ టాస్క్‌లు విజ‌య‌వంతంగా చేస్తే మీట‌ర్ పెరుగుతుంది. కొత్త‌గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా మీట‌ర్ ఛార్జ‌ర్‌గా ఉంటారని బిగ్ బాస్ తెలిపారు.

బిగ్ బాస్ టాస్క్‌లో భాగంగా ముందుగా వ‌చ్చిన ఫోన్‌ని గీతా లిఫ్ట్ చేస్తుంది. కాల‌ర్ ఇస్తున్న హింట్స్‌ని క‌రెక్ట్‌గా గెస్ చేసిన గీతా మాధురి ఆ కాల్ కౌశ‌ల్‌కి అని చెబుతుంది. ఫోన్ అందుకున్న కౌశ‌ల్ త‌న భార్య పిల్ల‌ల‌తో మాట్లాడుతూ చాలా ఎమోష‌న్ అవుతాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ .హౌజ్‌లో ఫ్రెండ్స్‌గా భావించి మాట్లాడే వారే నీ గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని కౌశ‌ల్ భార్య చెబుతుంది. ఇక కౌశ‌ల్ త‌ర్వాతి కాల్ రిసీవ్ చేసుకొని క్లూని బ‌ట్టి రోల్ రైడా అని చెబుతాడు. ఫోన్ అందుకున్న రోల్ త‌న చెల్లెలితో మాట్లాడుతాడు. హౌజ్‌లో చాలా ఎంటర్‌టైన్‌ చేస్తున్నావు. బయట చాలా మంది ఫ్యాన్స్‌ అయ్యారు. ఎవరినీ సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకో అని చెప్పకు. నీ ఆట నువ్వు ఆడాలి అంటూ సలహా ఇచ్చింది రోల్ చెల్లి.

ఇక మూడో కాల్ వ‌చ్చిన స‌మ‌యంలో కాల‌ర్ త‌న ఇంటి పేరుని చెప్ప‌డంతో కాల్ క‌ట్ అయింది. రూల్ పాటించ‌క‌పోవ‌డం వ‌ల‌న దీప్తి సున‌య‌న త‌న తండ్రితో మాట్లాడే అవ‌కాశాన్ని కోల్పోయింది. మళ్లీ తరువాత వచ్చే ఫోన్‌ కూడా రోల్‌ రైడానే గుర్తుపట్టాలని ఆదేశించాడు బిగ్ బాస్ . ఈ సారి సామ్రాట్‌కు సంబంధించిన వారు ఫోన్‌ చేశారు. వారిచ్చిన హింట్స్‌తో సామ్రాట్‌ను గుర్తుపట్టిన రోల్‌.. తనకి ఫోన్‌ అందజేశాడు. ఫోన్‌లో సామ్రాట్‌ అమ్మ మాట్లాడారు. గెడ్డం తీశాక బాగున్నావు. బాగా సన్నగా అయ్యావు. ఎందుకు వెళ్లావో అదే గుర్తుంచుకుని ఆడు. ఒకరితోనే కనెక్ట్ కావడం వల్ల బయట బాగా నెగెటివ్ టాక్ వచ్చింది. నిన్ను మేం అర్థం చేసుకుంటాం. కానీ, ప్రజలు అర్థం చేసుకోరు. అందరితో సమానంగా ఉండు. వేరేవీ ఏవీ అంటించుకోకు. నీ గురించి నెగె
టివ్‌గా వినడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఇక నేటి ఎపిసోడ్‌లో ఎవ‌రెవ‌రికి కాల్స్ వ‌స్తాయి, అవ‌తలి వారిచ్చిన హింట్స్‌ని గుర్తు ప‌డ‌తారో లేదా అనేది చూడాలి.

4673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles