ఐదేళ్ళ త‌ర్వాత సినిమా చేస్తున్న ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు

Wed,June 19, 2019 01:41 PM
Pooja Ceremony of  RajTarun Starrer Directed by  vijay kumar

గుండె జారి గల్లంతయిందే(2013), ఒక లైలా కోసం(2014) వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్న విజయ్ కుమార్ కొండ కొన్నాళ్ళుగా సినిమాల‌కి దూరంగా ఉన్నాడు. దాదాపు ఐదు సంవ‌త్స‌రాలుగా ఆయ‌న నుండి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ఆ మ‌ధ్య ప్రేమ‌, పెళ్ళి వ‌ల‌న ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్ర‌స్తుతం త‌న లైఫ్ స‌వ్యంగానే సాగుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇప్పుడు దృష్టి అంతా సినిమాల‌పైనే కేంద్రీకరించిన‌ట్టు తెలుస్తుంది. కుర్ర హీరో రాజ్‌త‌రుణ్‌తో త‌న తాజా ప్రాజెక్ట్‌ని సెట్ చేశాడు విజ‌య్ కుమార్ కొండ‌. తాజాగా ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోగా, ఆగ‌స్ట్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు. శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం విజ‌య్ కుమార్ కెరియర్‌కి మంచి విజ‌యం అందించాల‌ని, రానున్న రోజుల‌లో మ‌రిన్ని మంచి సినిమాలు తీసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించాల‌ని కోరుకుందాం. ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్ ఇద్ద‌రి లోకం ఒక‌టే అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో షాలిని పాండే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.2440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles